కుక్కపిల్ల గురించి అవి వదిలేసినా తమన్నా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tamanna
Updated:  2018-09-28 04:58:44

కుక్కపిల్ల గురించి అవి వదిలేసినా తమన్నా

గత కొంతకాలంగా తెరకు దూరంగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త నిర్ణయం ఒకటి తీసుకుంది. ఇకనుండి తాను చికెన్ లు మటన్ లు తినకూడదని ఫిక్స్ అయ్యిందట. ప్యూర్ వెజిటేరియన్ గా మారనుంది అని తెలిసింది. తనకెంతో ఇష్టం ఐన మటన్ చికెన్ లను వదలాలంటే కొంచెం బాధగా ఉన్నా సరే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.  తాను శాఖాహారిగా మారడంకు గల కారణంను తమన్నా వివరించింది.
 
తన కుక్క పిల్ల ఒక నెల రోజులుగా అనారోగ్యం భారిన పడటం తనని కలతకి గురిచేసిందట. దీనితో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇంట్లో ఒక మెంబెర్ లా పెరిగిన కుక్కపిల్ల అనారోగ్యంతో చూడలేక పోతుందట ఈ భామ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అస్సలు ప్రశాంతత లేదట. !! తనకి కూడా మనశాంతి కరువైంది అని చెప్పుకొచ్చింది. కుక్కపిల్ల ఆరోగ్యం తో పాటు తన ఆరోగ్యం కూడా బాగుండాలని ఈ నిర్ణయం తేసున్నట్లు చెప్పింది. 
 
ఇలా మారడం  కష్టమైన పని. కూరగాయలను తీసుకోవడం మామూలు విషయం కాదని కొన్ని రోజుల్లోనే తెలుసుకున్నాను. అయినా కూడా తాను ఇకపై శాఖాహారమే తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి తాజాగా చిరంజీవి 152వ చిత్రంలో నటించే అవకాశం కూడా వచ్చిందని వినికిడి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.