తమిళ్ వారు ఆ సైట్స్ బ్యాన్ చేశారట..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kollywood
Updated:  2018-10-24 12:46:57

తమిళ్ వారు ఆ సైట్స్ బ్యాన్ చేశారట..

చిత్ర పరిశ్రమ ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పైరసీ. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి, సంవత్సరాల తరబడి కొన్ని వందలాది మంది కష్టపడితే ఒక సినిమా రూపుదిద్దుకొని,రిలీజ్ అవుతుంది. అలాంటి దాన్ని, చాలా సులభంగా పైరసీ చేసేస్తారు. ఈ పైరసీ దర్శకనిర్మాతలకు పెద్దసమస్యగా తయారయ్యింది.తాజాగా తమిళం లో విడుదలైన రెండు భారీ సినిమాలు విడుదలైన మొదటి రోజే పైరసీ అయ్యాయి.

విశాల్ హీరో గా నటించిన సండకొలి 2 మరియు ధనుష్ నటించిన వడ చెన్నయ్ చిత్రాల పైరసీ లింక్ లను కలిగి ఉన్న కొన్ని వెబ్ సైట్ లను కోలీవుడ్ నిర్మాతల మండలి కి చెందిన యాంటీ పైరసీ సెల్ గుర్తించిందట. వెంటనే ఆ సైట్ లను బ్యాన్ చేయడం తో పాటి వాటిని తొలగించే ప్రయత్నాలలో ఉన్నారట.ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏదో ఒక మార్గంలో పైరసీ అవుతూనే ఉంది.కోలీవుడ్ ఒక్కటే కాదు అన్ని సినిమా పరిశ్రమలో కూడా పైరసీ అనేది పెద్ద ప్రమాదంగా మారింది.

దీనిని అరికట్టడం ఎవరి తరం కావడం లేదు. ఎప్పుడైతే ప్రేక్షకులు పైరసీ చూడకుండా ఉంటారో అప్పుడే వారి ఆట కట్టడం జరుగుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ సైట్లు బ్యాన్ చేసిన, మరొక డొమైన్ పేరుతో మళ్ళీ పైరసీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సైట్స్ బ్యాన్ చెయ్యడం వల్ల పెద్ద ఉపయోగం ఏం ఉండదు అంటున్నారు నిపుణులు.

షేర్ :