తమిళ్ లో శ్రీ రెడ్డి కి అవకాశం ఇచ్చారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-07-27 05:49:31

తమిళ్ లో శ్రీ రెడ్డి కి అవకాశం ఇచ్చారు

శ్రీ రెడ్డి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఎందుకంటే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా లో హలచల్ చేస్తున్న పేరు ఇది. అయితే ఇటివలే ఈ భామ టాలీవుడ్ ని వదిలేసి కోలీవుడ్ కి వెళ్ళిన సంగతి అందరికి తెలిసిందే. అక్కడికి వెళ్లి అక్కడ ఎంతో మంది స్టార్స్ పై విమర్శలు చేసింది.
 
ఈ నేపథ్యంలోనే శ్రీ రెడ్డికి తమిళనాట అవకాశాలు ఇచ్చేనందుకు ప్రముఖ నిర్మాత కుట్టి పద్మిని సిద్ధం అయ్యింది. తమిళంలో నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్న ఈమె శ్రీరెడ్డికి సీరియల్స్ లో అవకాశాలు ఇచ్చేనందుకు ముందుకు వచ్చింది. శ్రీ రెడ్డి ని హీరోయిన్ గా పెట్టి ఒక సీరియల్ తీయబోతుంది అంట ఈమె. శ్రీరెడ్డి విషయం తనకు ఎంతో బాధగా అనిపించింది అని, ఆమె జీవితంలో చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది అంటూ పద్మిని చెప్పుకొచ్చింది.
 
అలాగే కొందరు చేసిన తప్పుకు ఆమె తమిళ సినీ పరిశ్రమ మొత్తం ను బ్యాడ్ చేయడం మంచి పద్దతి కాదని చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీ రెడ్డి కి ఏదో ఒక దాంట్లో అవకాశం ఇచ్చి నోరు మూయించే ప్రయత్నం చేస్తుంది తమిళ ఇండస్ట్రీ. ఇదిలా ఉంటే విశాల్ ఇప్పటికే ఈమె మీద తగిన చర్యలు తీసుకుంటున్నాడు అని సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.