తనిష్ ఆర్మీ కూడా వచ్చేసింది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tanish army
Updated:  2018-09-11 05:21:29

తనిష్ ఆర్మీ కూడా వచ్చేసింది

బిగ్ బాస్ 2  వల్ల కౌశల్ ఆర్మీ క్రియేట్ అయ్యి పెద్ద సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. బిగ్ బూస్స్ హౌస్ మెట్ కౌశల్ కి సపోర్ట్ గా నిలిస్తూ ఈ ఆర్మీ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంతవరకూ బిగ్‌బాస్‌కి సంబంధించి కౌషల్‌ ఆర్మీ పేరుతో కౌషల్‌కి వ్యతిరేకంగా బిగ్‌హౌస్‌లో ఏం జరుగుతున్నా సోషల్‌ మీడియాలో వారిని ఓ ఆట ఆడేసుకుంటోంది ఈ కౌల్‌ ఆర్మీ.
 
ఇటీవలే కౌషల్‌కి మద్దతుగా ఈ ఆర్మీ హైద్రాబాద్‌లో 2కె రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తనిష్ ఫ్యాన్స్ కూడా తనిష్ ఆర్మీ అని ఒకటి స్టార్ట్ చేసారు. 5కె రన్‌ పేరుతో కౌషల్‌ ఆర్మీకి గట్టి కౌంటరే ఇవ్వబోతుంది ఈ తానీష ఆర్మీ. గత 92 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో క్లైమాక్స్‌కి దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు అందరూ ఈ హంగామా క్రియేట్ చేస్తున్నారు.
 
హౌస్‌లో డే వన్‌ నుండీ కౌషల్‌కి వ్యతిరేకంగానే మిగిలిన కంటెస్టెంట్స్‌ బిహేవియర్‌ ఉండడాన్ని ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తనీష్‌ మొదట్నుంచీ కౌషల్‌కి యాంటీనే, మరి ఇప్పుడు ఈ తనిష్ ఆర్మీ కౌశల్ ఆర్మీని ఎలా ఎదురుకుంటుందో చూడాలి.

షేర్ :