కార్ లో పోసేసిన తనీష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bigg boss 2
Updated:  2018-09-08 04:17:54

కార్ లో పోసేసిన తనీష్

రోజురోజుకి బిగ్ బాస్ రియాలిటీ షో మితిమీరిపోతోంది. ముగింపు కి చేరుకునే దశలో దారుణమైన టాస్క్ ల పేరుతో ఉన్న మంచి పేరును చెడగొట్టుకుంటుంది. 100 రోజులకు గాను 89 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆడమగ అని బేధం లేకుండా ఇబ్బంది కరమైన పరిస్తితులను కల్పించాలని సంకల్పించింది. తాజాగా టిక్కెట్ ఫినాలే అనే ఒక వింత టాస్క్ ను ఇంటి సభ్యుల ముందు ఉంచింది.
 
దీనిలో భాగంగా ఎవరైతే 24 గంటలపాటు కారు లో ఉంటారో వారే అర్హులని ప్రకటించింది. ఈ టాస్క్ లో తనీష్ ప్రవర్తన పలు వివాదాలకు దారితీసేలా ఉంది. తనీష్ - దీప్తి - గీత మాధురి - సామ్రాట్ - శ్యామలలు మాత్రమే కార్ ని ఎక్కగలిగారు మిగిలిన వారు వివిధ కారణాలతో అనర్హులు అయ్యారు. టాస్క్ మధ్యలో నిద్రిస్తున్న కారణంగా గీతాన్ని కార్ నుండి బహిష్కరించారు.
 
ఆ తర్వాత సామ్రాట్, దీప్తి, తనీష్ లు కార్ దిగే యత్నం చేశారు. కానీ దీప్తి తనీష్ ల మధ్య జరిగిన శారీరక ఘర్షణ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తనీష్ ప్రవర్తించిన తీరు తెన్నులపై అందరూ పెదవి విరుస్తున్నారు. సామ్రాట్ బాత్రూమ్ కోసం కార్ నుండి బయటకు వెళ్ళినప్పుడు కార్ లో తనీష్ తోపాటు దీప్తి శ్యామల లు మాత్రమే ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారని చూడకుండా కార్ లొనే మూత్ర విసర్జనకు పునుకున్నాడు తనీష్. దీంతో ప్రేక్షకులు చాలా మందికి ఈ షో పై విరక్తి వచ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.