మందు కొట్టి షూటింగ్ కి వెళ్ళా టాక్సీవాలా హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

priyanka jawalkar
Updated:  2018-11-06 05:14:35

మందు కొట్టి షూటింగ్ కి వెళ్ళా టాక్సీవాలా హీరోయిన్

రిలీజ్ కి ముందే పైరసీ కి గురి అయ్యి ఆ మధ్య వార్తల్లో నిలిచింది విజయ్ దేవరకొండ హీరో గా నటించిన టాక్సీవాలా సినిమా, ఆ తరువాత ఒక పాట మినహా మరే విషయం ఈ సినిమా కోసం వార్తల్లో లేదు. ఒకపక్క విడుదలకు దగ్గర పడుతున్న కూడా ప్రమోషన్ కి నోచుకోవట్లేదు ఈ సినిమా.ఈ చిత్రం నవంబర్ 17 వ తారీఖు న రిలీజ్ కానుంది. ఎన్నో వాయిదాల కారణం గా ఈ సినిమా రిలీజ్ లేట్ అయింది.

అయితే ఈ కారణం గా కొంచెం ఈ సినిమా పై అంచనాలు తగ్గినప్పటికీ, ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కావడం తో ప్రాబ్లెమ్ ఎం లేదు అనుకుంటున్నారు చిత్ర వర్గం వారు. అయితే ఈ సినిమా లో నటించిన హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఇంటర్వ్యూ సందర్భంగా మీడియా ముందు ఈ చిత్ర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, సినిమాలో ఒక లాంగ్ సీన్ ఉంది అని, దాంట్లో హీరోయిన్ పాత్ర మందు కొట్టి ఉంటది అని చెప్పుకొచ్చింది.దర్శకుడు చెప్పడంతో సహజత్వం కోసం మందుకొట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. 

ఆ సీన్ షూటింగ్ జరిగినన్ని రోజులూ తన క్యారవాన్ లో వోడ్కాను మినిట్ మెయిడ్ తో కలిపి తాగానని.. ఆ మత్తులోనే షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది.మందుకొట్టడం తనకు మొదటిసారి అని.. మత్తులో ఉన్నప్పుడు విపరీతంగా నవ్వొచ్చేదని.. ఆ మత్తును హ్యాండిల్ చేయడం కష్టమేనని అంటోంది.  జవాల్కర్ ఆ సీన్ ఎంత పండించిందో తెలియాలంటే 17 వరకు మనం ఆగాల్సిందే.