మహేష్ కత్తి ని రాష్ట్రం నుంచి బహిష్కరించిన ప్రభుత్వం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 18:22:20

మహేష్ కత్తి ని రాష్ట్రం నుంచి బహిష్కరించిన ప్రభుత్వం

మహేష్ కత్తి ఇటివలే శ్రీ రాముడి పై నెగిటివ్ కామెంట్స్ చేసి అందరి దృష్టి లో నెగిటివ్ అయ్యాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పుడే కత్తి మహేష్ వ్యాఖ్యలని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పైన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసి విచారించారు.

అయితే ఈ విషయం పై చర్యలు తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం మహేష్ కత్తిని నగరం నుండి బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. అసలైతే మహేష్ కత్తి వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు బోడుప్పల్ నుండి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర చేయాలని పరిపూర్ణానంద స్వామి నిశ్చయించారు.

ఇక ఈ యాత్ర జరిగితే కచ్చితంగా శాంతిభద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆయనని గృహనిర్భంధంలో ఉంచారు. అసలు ఈ ఇష్యూ కి మొత్తం మహేష్ కత్తి ఏ కారణం అని డిసైడ్ అయిన పోలీసులు మహేష్ కత్తిని హైదరాబాద్ నగరం నుండి బహిష్కరిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుని ఆ లేఖని స్వయంగా మహేష్ కి అందచేసి నగరం బయట విడిచిపెట్టారట. దాదాపు ఆరు నెలల కాలం పాటు మహేష్ కత్తి నగరం నుంచి దూరంగా ఉండాలి అని పోలీసులు మహేష్ ని ఆదేశించారు.