నార్కో టెస్టులు చేయాల్సిందే అంటున్న తనుశ్రీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

thanu sree dutta
Updated:  2018-10-15 12:22:59

నార్కో టెస్టులు చేయాల్సిందే అంటున్న తనుశ్రీ

నానా పాటేకర్ పైన తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు సౌత్ మొత్తంలో మీటూ ఉద్యమానికి తెరలేపింది. అప్పటినుండి చాలా మంది అమ్మాయిలు, హీరోయిన్లు, సింగర్లు, విలేఖరులు వారిని లైంగికంగా వేధించిన వారి గురించి నిజాలు బయటపెడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తనుశ్రీ దత్తా విషయం ఇంకో ఎత్తు. ఆమె ఇప్పటికే చాలా పెద్ద పేర్లు బయటకి తీసింది.

ముంబై ఓశివరా పోలీస్ స్టేషన్లో నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య,దర్శకనిర్మాతలు సమీ సిద్ధీఖి మరియు రాకేష్ సారంగ్ తదితరులపై తనూశ్రీ దత్తా ఫిర్యాదు చేసి షాక్ ఇచ్చింది. వారంతా తనపై దాడి చేశారని, ఇటు నానా లైంగికంగా వేధించాడని తనూశ్రీ ఆరోపించింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా, తనుశ్రీ దత్తా పోలీసులకు ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో నానా పై నార్కోటిక్ టెస్టులు చేయాలని, లై డిటెక్టర్తో అతడు చెప్పేవాటిల్లో నిజానిజాలు పరిశీలించాలని పోలీసులకు విన్నవించింది. అంతే కాక నానాకు ఉన్న రాజకీయ పరిచయాల ద్వారా కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అలాగే సాక్ష్యాలు కూడా తారుమారు అవుతాయని తన భయాన్ని పంచుకుంది. చూస్తే మీ టూ ఉద్యమం వేడి తగ్గినా తనుశ్రీ, నానా గొడవ మాత్రం ఒక కొలిక్కి వచ్చేలా లేదు.

షేర్ :

Comments

0 Comment