ఆ క్రియేటివ్ డైరెక్టర్ కి పిచ్చి అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 05:57:45

ఆ క్రియేటివ్ డైరెక్టర్ కి పిచ్చి అంట

డైరెక్టర్ గా నటుడిగా రవిబాబు కి మంచి పేరు ఉంది. లేటెస్ట్ గా ఆయన "అదుగో" అనే టైటిల్ ని పెట్టి పందిపిల్లతో ఒక సినిమా చేసాడు. పందిపిల్లతో ఈ సినిమా చేసిన రవిబాబు ఓపికను చూసి మెచ్చుకోవాల్సిందే  అని రవిబాబుని చాలా మంది మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా గురించి రవిబాబు మాట్లాడుతూ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో లవ్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ "అదుగో". పిల్లలకు బాగా నచ్చుతుంది. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాని వేసవిలో విడుదల చేస్తామని ఆయన అన్నాడు.

అలాగే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నని రోజులు రవిబాబుకి పిచ్చి  పట్టిందా అని చాలా మంది అడిగారు అంట. రవి బాబు ఈ విషయం గురించి మాట్లాడుతూ పందిపిల్లతో సినిమానా? వాడికి మానసిక పరిస్థితి బాగానే ఉందా? అంటూ చాలామంది నాతొ అన్నారు. ఈ సినిమా రెండేళ్ళ క్రితం మొదలైంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు అందరూ ఇదే మాట అనేవారు అని రవిబాబు నవ్వుతు చెప్పుకొచ్చాడు. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో సినిమాకు ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.