"అరవింద సమేత" లో ఆ సీన్స్ హై లైట్ అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-08-17 01:50:35

"అరవింద సమేత" లో ఆ సీన్స్ హై లైట్ అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలం తరువాత ఒక ఫ్యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. అదే "అరవింద సమేత", త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క టిజర్ అందరిని ఆకట్టుకుంటుంది.

అయితే ఈ టిజర్ లాస్ట్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో పరిగెత్తుకు రావడం ఉంది. సినిమాలో అయితే ఈ ఫైట్ సీన్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉండనుంది అంట. దాదాపు పదిహేను నిమిషాలు ఉండే ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తన నటన విశ్వరూపం చూపించనున్నాడు అని తెలిసింది. "అతడు" తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వస్తున్న యాక్షన్ సినిమా ఇదే.

ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్టు కొడుతుంది అనే నమ్మకంతో త్రివిక్రమ్ అభిమానులు ఉన్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఈశ రెబ్బ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది. అలాగే నాగ బాబు ఇంకా జగపతి బాబు కూడా కథకి ఉపయోగపడే పాత్రలో అలరించనున్నారు. మరి తొలిసారి జత కట్టిన త్రివిక్రమ్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.