అరవింద సమేత లో ఆ పాట హైలైట్ అట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-08-16 01:18:57

అరవింద సమేత లో ఆ పాట హైలైట్ అట

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ “అరవింద సమేత. వీర రాఘవ” , హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో  ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ఒక అద్భుతమైన పాట  పాడినట్లు తెలుస్తోంది, ముఖ్యంగా ఈ పాట చిత్రంలో అత్యంత కీలకమైన సన్నివేశంలో వస్తుందిట, ఇందుకోసం తమన్ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్ కు  కైలాష్ తన గాత్రంతో ప్రాణం పోసినట్లు సమాచారం, ఇక ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ అందించిన ఈ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇక నాగబాబు, జగపతిబాబు, ఈషారెబ్బ కీలకపాత్రలు పోషిస్తున్న మూవీ విడుదల అక్టోబర్ లో ఉండబోతోంది.

ఇదిలా ఉంటె టిజర్ తోనే ఈ సినిమాలో ఏ రేంజ్ లో యాక్షన్ ని పండించాబోతుడో చెప్పకనే చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.