దేవిశ్రీతో అందుకే సినిమా తీయ‌ట్లేదు త్రీవిక్ర‌మ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-11 03:10:41

దేవిశ్రీతో అందుకే సినిమా తీయ‌ట్లేదు త్రీవిక్ర‌మ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా నుండి వారి ప్రయాణం చాలా సినిమాలతో సాగింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలొచ్చాయి. సినిమాలే కాక ఈ ఆడియోలు కూడా సూపర్ హిట్టే. కానీ అఆ సినిమాకు అనిరుధ్ ను తీసుకోవాలని అనుకున్నాడు కానీ కుదరకపోవడంతో మిక్కీ జే మేయర్ తో సరిపెట్టుకున్నాడు.

అజ్ఞాతవాసికి పట్టుబట్టి అనిరుధ్ తో మ్యూజిక్ చేయించుకున్నాడు.  కానీ సినిమా డిజాస్టర్ లో పాటల పైన కూడా కొన్ని నెగటివ్ కామెంట్లు రావడంతో, ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ ను తప్పించి తమన్ ను తీసుకున్నాడు. మరి త్రివిక్రమ్ మళ్లీ అనిరుధ్ తో పని చేస్తాడా లేదా అన్న సందేహాలున్నాయి జనాల్లో.

దీని పై స్పందిస్తూ, అనిరుద్ కి తెలుగు సినిమా సంగీతాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని, అలాగే అనిరుధ్ ను తను అర్థం చేసుకోవడానికి కూడా సమయం కావాలని, అరవింద సమేతకు అతడిని వద్దనుకున్నానని చెప్పాడు. ఇక దేవి శ్రీ తో సినిమా చేయట్లేదే అంటే, తమ మధ్య గ్యాప్ ఏమీ లేదని, ఇప్పటికీ టచ్ లో ఉన్నామని, కానీ తనను తాను కొత్తగా కనుక్కునే ప్రయాణంలో మిగిలిన వాళ్లతో ప్రయాణం చేస్తుంటానని అందుకే కొత్త వారితో సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.