వారం రోజులు ఆలస్యంగా వస్తున్న చిలసౌ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-25 04:24:36

వారం రోజులు ఆలస్యంగా వస్తున్న చిలసౌ

అక్కినేని కాంపౌండ్ నుండి హీరోలుగా   వచ్చిన వారిలో  యవ కథానాయకుడు సుశాంత్ ఒకడు,  హీరోగా నాలుగు సినిమాలు చేసినా ఆశించిన విజయం లభించకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకోని తను చేసిన చిత్రం "చి ల సౌ". ఇక ఈ చిత్రానికి "అందాల రాక్షసి" ఫేమ్ అయినా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది, అయితే అదే రోజు బెల్లంకొండ శ్రీనివాస్ "సాక్ష్యం", సుమంత్ అశ్విన్ - నిహారికల "హ్యాపీ వెడ్డింగ్" చిత్రాలు ఉండడంతో ఈ పోటీ నుండి "చి ల సౌ" తప్పుకుంది. ఈ చిత్రం జులై 27 నుండి ఆగస్టు 3 తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ పిక్షర్స్ సమర్పిస్తుండగా శ్రీని సినీ కార్పొరేషన్ పతాకంపై నిర్మించారు. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్ కి ఈ చిత్రం కీలకంకానుంది, మరి తను అనుకున్నట్లుగా ఈ చిత్రం విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.