ఇందులో కొత్తదనం ఎక్కడుంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-11 12:32:08

ఇందులో కొత్తదనం ఎక్కడుంది

దిల్ రాజు అంటే టాలీవుడ్ లో బ్రాండ్ లాంటి పేరు. గతేడాది డబుల్ హాట్ట్రిక్ తో అందలం ఎక్కిన దిల్ రాజు ఈ సంవత్సరం మాత్రం రెండు డిజాస్టర్లతో పాతాళానికి పడిపోయాడు. తన ఫెయిల్యూర్ ని విశ్లేషించడం మానేసి ఈమధ్య ప్రేక్షకులు చెడు చూపిస్తేనే చూస్తున్నారు, ముద్దు సీన్లు ఉంటేనే హిట్ చేస్తున్నారు అంటూ అభాండాలు వేశాడు. ఇక తన రాబోయే సినిమా కూడా గొప్పగా ఇండబోతోంది అన్నట్టు కబుర్లు చెప్పాడు. ఆ సినిమానే హలో గురు ప్రేమ కోసమే. రామ్, అనుపమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబరు 8 న విడుదలవ్వనుంది.

ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ చూస్తే పలు సినిమాలలో హిట్ అయిన పాయింట్లు పేర్చి సినిమా తీసినట్టు అనిపించింది తప్ప అంత క్వాలిటీ ఉన్నటు కనపడలేదు. అయినప్పటికీ, తనకున్న నెట్వర్క్ తో తన సినిమాకు పోటీ అంటూ ఏదీ రాకుండా బాగానే చూసుకున్నాడు దిల్ రాజు. అయితే ఉన్న ఒకే ఒక్క అపాయం అక్టోబర్ 11న అరవింద సమేత సినిమా నుండే.

ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని హలో గురు. యావరేజ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేదు. అరవింద పెద్దగా ఆడకపోతే ఒక పండగ సెలవుల్లో ఉన్న సినిమాలే చూడాలి అన్నట్టు అయినా జనాలు చూస్తారు. చూద్దాం మరి రాజు గారి అదృష్టం ఈసారి ఎలా ఉందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.