త్రివిక్రమ్ పెట్టిన మూడు కండిషన్లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-11 12:50:20

త్రివిక్రమ్ పెట్టిన మూడు కండిషన్లు

త్రివిక్రమ్‌-తమన్‌ కాంబినేషన్‌ ప్రేక్షకులకు కచ్చితంగా ఒక సర్ప్రైజ్ లాంటిదే. నిజానికి అరవింద సమేత సినిమా అనౌన్స్ చేసినప్పుడు ముందు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ తరువాత త్రివిక్రమ్ అతనిని తప్పించి థమన్ ని రప్పించాడు. అయితే, థమన్ కి ప్రత్యేకమైన శైలి ఉంది. అయితే అరవింద సమేత సినిమా కి సంగీతం సమకూర్చేముందు త్రివిక్రమ్ కొన్ని కండిషన్లు పెట్టాడట.

అందులో మొదటిది మాములుగా థమన్ పాటల్లో ఎక్కువ హిందీ ఉంటుంది కాబట్టి ఈ సినిమా పాటల్లో హిందీ వద్దు. ఈ సినిమాలో హిందీ కుదరదు. తెలుగు మాత్రమే ఉండాలి.ఇక రెండవది సాంగ్‌ అండ్‌ డ్యాన్స్‌ నంబర్లు ఉండే సినిమా కాదు ఇది. కథలో వాటికి స్కోప్‌ లేదు. అందువల్ల, వాటి జోలికి వెళ్లకూడదు.

ఇక మూడో ఆఖరి కండిషన్ ఏంటంటే ఎన్టీఆర్‌ స్టార్‌ హీరో కాబట్టి, కచ్చితంగా ఒక డ్యాన్స్‌ నంబర్‌ ఉండాలని భయపడవద్దు. ఇటువంటి భయాలు తీసేద్దాం అని తమన్‌కి ఈ మూడు రిక్వెస్టులు చేశాడట త్రివిక్రమ్. ఇవి రిక్వెస్టులు లాగా కాకపోయినా కండిషన్ల లానే అనిపిస్తున్నాయి. ఇక ఇవాళే విడుదలైన 'అరవింద సమేత' ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.