వ‌ధువుకు 36 వ‌రుడికి 25

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

priyanka chopra and nick jonas
Updated:  2018-08-18 04:48:32

వ‌ధువుకు 36 వ‌రుడికి 25

బాలీవుడ్ నటి అయిన ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా హాలీవుడ్ లో సందడి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే హాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న సంధర్బంలోనే ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ అయిన నిక్ జానస్ తో ప్రేమలో పడింది అనే వార్తలు ఇక్కడి మీడియా లో హలచల్ చేసాయి.

ఇప్పుడు ఈ రూమర్స్ అన్నింటిని బద్దలు కొడుతూ ప్రియాంక చోప్రా తన ప్రేమ విషయం గురించి అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వీళ్ళు తమ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ వేడుక కోసం స్టార్స్ అందరూ తరలి రానున్నారు. ఇప్పటికే చోప్రా ఫ్యామిలీ వారు అతిధుల కోసం 200 హోటల్ రూమ్స్ బుక్ చేసారు అని తెలుస్తుంది.

ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి రంవీర్ సింగ్, కరణ్ జోహార్, మనిష మల్హోత్రా, సోఫియా చౌదరి, రవీనా టాండన్ తదితరులు హాజరు కానున్నారు. ఇక వీళ్ళు పెళ్లి ఎపుడు చేసుకోబోతున్నారు అనే విషయాలు త్వరలో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే పెళ్లి తరువాత ప్రియాంక చోప్రా హిందీ లో సినిమాలు చేస్తుందా..? లేకపోతె హాలీవుడ్ లోనే సెటిల్ అవుతుందా అనేది క్యూస్షన్ మార్క్ గా మారింది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.