హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-19 10:21:38

హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు క‌న్ను మూశారు. గ‌త కొద్ది కాలంగా మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయ‌న్ను...సోమవారం ఉద‌యం 3.30 గంటల సమయంలో  కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. అప్ప‌టికే తుది శ్వాస విడిచిన హనుమంతరావును పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు.
 
టాలీవుడ్‌లో మంచి క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్న గుండు హనుమంతరావు అనారోగ్య కార‌ణంగా సినిమాల‌కు దూరం అయ్యారు.  ఇటీవ‌ల ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విష‌యాన్ని తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరు చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 400చిత్రాల‌కు పైగా న‌టించిన గుండు హనుమంతరావు అహ నాపెళ్లంట, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, పెళ్లాం ఊరెళితే సినిమాల్లో అద్భతంగా న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు.ఇక‌ బుల్లితెర పై అమృతం అనే సీరియల్లో న‌టించి నంది అవార్డు సైతం అందుకున్నారు హనుమంతరావు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.