ప్లాప్స్ లో ఉన్న ఈ ముగ్గురు ఒకే సినిమా చేస్తున్నారు..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-10-08 01:12:49

ప్లాప్స్ లో ఉన్న ఈ ముగ్గురు ఒకే సినిమా చేస్తున్నారు..

అందం, అభినయం ఉన్నా ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి... టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొత్తలో హిట్లు అందుకున్న భామ అనుపమ పరమేశ్వరన్.. ఈ మధ్య ఈ అమ్మడి అదృష్టం ఏమి బాగోలేనట్టుంది.. ఎందుకంటే ఈ మధ్యకాలం లో అనుపమ నటించిన, ఉన్నది ఒకటే జిందగి, తేజ్ ఐ లవ్ యూ, కృషార్జున యుద్ధం ఇలా వరుస ప్లాప్ లతో అనుపమ కెరీర్ ఇబ్బందిలో పడింది.ఈ ప్లాప్ లతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా తగ్గాయి..

ఉన్నది ఒకటే జిందగీ ఫ్లాప్‌ అయినా కానీ అందులో అనుపమ పర్‌ఫార్మెన్స్‌ బాగా నచ్చడంతో రామ్‌ తన తరువాతి చిత్రంలోను ఆమె పేరునే సిఫార్సు చేసాడు. అందుకే దిల్‌ రాజు నిర్మించిన హలో గురూ ప్రేమకోసమేలో అవకాశం దక్కించుకున్న అనుపమ ఇప్పుడు తన ఆశలన్నీ దీని మీదే పెట్టుకుంది... అది అలా ఉండగా, దిల్ రాజు శ్రీనివాస కల్యాణం తో, రామ్ ఉన్నది ఒకటే జిందగితో, అనుపమ కృష్ణార్జున యుద్దంతో ముగ్గురు ప్లాప్ లో ఉన్నారు..

ఈ ప్లాప్ బ్యాచ్ అంతా ఇప్పుడు కలిసి సినిమా తీస్తున్నారు, ఈ ముగ్గురు ఆశలు దీని మీదనే ఉన్నాయి.. కానీ ఈ సినిమా డైరెక్టర్ త్రినాథరావు మాత్రం మంచి ఊపు మీద ఉన్నాడు.. ఏది ఎలా ఉన్నా..ఈ చిత్రం కానీ ఫెయిలయితే అనుపమకి కొత్త అవకాశాలు రావడం చాలా కష్టమవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.