మల్టీస్టారర్ సినిమా లు నేను చెయ్యను అంటున్న తెలుగు హీరో...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-11-01 05:03:15

మల్టీస్టారర్ సినిమా లు నేను చెయ్యను అంటున్న తెలుగు హీరో...

అప్పట్లో మల్టీస్టారర్ చిత్రాలు అంటే ఏ ఇగో లు లేకుండా కథ పరిధి లో పాత్ర ఉంటే , అది మంచిది అయితే చాలు అనుకోని నటించి హిట్లు కొట్టేవాళ్ళు..ఆ కోవలోనే గుండమ్మ కథ లాంటి మంచి హిట్లు వచ్చాయి. అయితే రానురాను హీరో ల ఇమేజ్ తారా స్థాయికి చేరి, మల్టీస్టారర్ చిత్రాల రాక తగ్గింది.మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో ఆ ఊపు మొదలయ్యేలా కనిపించినా మరో చిత్రం రాలేదు..యువ హీరోలు పలువురు మల్టీ స్టారర్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. కాని ఒక హీరో మాత్రం మల్టీస్టారర్ మూవీ అంటే బాబోయ్ నీకో దండం అంటున్నాడు.

డైరెక్షన్ ఫీల్డ్ బ్యాక్ గ్రౌండ్ గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి  తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న ఆ హీరో ఈమద్య వరుసగా విజయాలను దక్కించుకున్నాడు. దాంత ఈయనకు మినిమం గ్యారెంటీ హీరో లా గుర్తింపు పొందాడు. ఇలాంటి సమయంలో ఒక మల్టీస్టారర్ చిత్రం చేసి తీవ్రంగా నిరాశ పర్చాడు. సోలో హీరోగా వరుసగా చిత్రాలు చేసి మంచి విజయాలు దక్కించుకున్న ఆ యువ హీరో సీనియర్ హీరోతో చేసిన మల్టీస్టారర్ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ మల్టీస్టారర్ చిత్రాల జోలికి వెళ్లవద్దని నిర్ణయించుకున్నాడట.

ఆ విషయాన్ని సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. తాజాగా ఒక దర్శకుడు మల్టీస్టారర్ స్క్రిప్ట్ ఆ హీరో వద్దకు వెళ్లిన సమయంలో నీకో దండం - నీ మల్టీస్టారర్ స్క్రిప్ట్ కు పెద్ద దణ్ణం, ఇలాంటి స్క్రిప్ట్స్ తో నా దగ్గరకు రాకు అన్నాడట. ఏదేమైనా ఒక సినీమా తో షాక్ తిన్న ఈ హీరో మల్టీస్టారర్ ఇకపై చేయను అంటూ తెగేసి చెబుతున్నాడట. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో ఆ  హీరో సెట్స్ లో బిజీ గా గడుపుతున్నాడు.

షేర్ :

Comments

0 Comment