పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తాను - నివేత థామస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine nivetha thomas
Updated:  2018-07-24 12:40:09

పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తాను - నివేత థామస్

2016 లో నాని హీరోగా వచ్చిన "జెంటిల్మన్" సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ భామ నివేద థామస్. ఈ సినిమా సక్సెస్ తరువాత "నిన్ను కోరి" "జై లవ కుశ" వంటి మూవీస్ లో నటించి కుర్రకారుని తన వైపుకి తిప్పుకుంది.
 
ఆ సినిమా తరువాత నివేత థామస్, నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాకి సంభందించిన ఒక లుక్ ఇటివలే రిలీజ్ అయ్యింది. అయితే నివేత థామస్ ఇటివలే ప్రింట్ మీడియాతో మాట్లాడుతూ "నేను పెళ్లి చేసుకున్నాక కూడా నటిస్తాను.
 
ఒక టీచర్ ని పెళ్లి చేసుకున్నాక టీచింగ్ మానేస్తారు అంటే.. లేదు పెళ్లి తరువాత కూడా టీచింగ్ చేస్తాను అంటారు కదా ఇది కూడా లాగే" అంటూ చెప్పుకొచ్చింది నివేత థామస్. అలాగే ఇప్పుడిప్పుడే నా చదువు పూర్తయింది ఇంకా అప్పుడే పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తాను అని కూడా అంటోంది ఈ మళయాళ బ్యూటీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.