టాప్ హీరోయిన్లు ఎవరు వేధింపులు ఎదుర్కోలేదా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood top heroines
Updated:  2018-10-23 13:21:24

టాప్ హీరోయిన్లు ఎవరు వేధింపులు ఎదుర్కోలేదా?

మీటూ అనే పదం చిత్ర పరిశ్రమ ని ఒక ఊపు ఊపుతుంది.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఇండస్ట్రీలో స్త్రీలు ఈ మీ టూ ద్వారా మీడియా ముందు ఎవరి వల్ల ఎదుర్కొన్నారు అన్న విషయం చెప్తున్నారు.. కానీ ఈ మీటూలో మీడియా ముందుకు వచ్చే వాళ్ళు అందరూ కూడా మాజీ హీరోయిన్, సింగర్లు, కారెక్టర్ ఆర్టిస్ట్స్ కావడం వారికి ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ మద్దతు పలకడం మనం చూస్తున్నాం..

అయితే ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది.ఫామ్‌లో వున్నవాళ్లు, ప్రస్తుతం టాప్‌లో వున్న వాళ్లు ఇలాంటి ఆరోపణల జోలికి పోవడం లేదు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సాధారణం అయినప్పుడు అందరూ ఏదొక సందర్భంలో వేధింపులు ఎదుర్కొనే ఉంటారు.. కెరీర్ స్టార్టింగ్ స్టేజి లో వేధింపులు ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి..

మరి ఈ టాప్ లో ఉన్న హీరోయిన్లు ఎందుకు నోరు మెపట్లేదు అనేది కొందరి ప్రశ్న. బాలీవుడ్ లో కంగనా, రాధిక ఆప్టే ఇప్పటికే వారి అనుభవాలు చెప్పినా, సౌత్ లో మాత్రం ఏ టాప్ హీరోయిన్ ఈ ఉద్యమంలో పాల్గొనడం లేదు. కెరీర్ ముగిసిన, అవకాశాలు రాని వారికి మాత్రమే ఈ ఉద్యమం వర్తిస్తుందా అనే వాదన కూడా లేకపోలేదు. అయినా వేధింపులు ఎదుర్కొనే సమయంలో బైట పెట్టడం మానేసి ఇప్పుడెందుకు చెప్తునట్టు మీకు అవకాశాలు ఉన్నంత వరకు ఇప్పటి టాప్ హీరోయిన్లు లా ఉరుకుంటారా అని రాజకీయ నాయకులు కూడా ఈ ఉద్యమం పై ప్రశ్నిస్తున్నారు.