టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత కుమారుడు హీరోగా ఎంట్రీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-06-26 11:32:09

టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత కుమారుడు హీరోగా ఎంట్రీ

ఎంద‌రో హీరోల‌ను పెట్టి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో సినిమాలు తీస్తారు నిర్మాత‌లు.. అయితే నిర్మాత కొడుకుల‌ను కూడా హీరోలుగా తెర‌పై చూడాలి అనే కోరిక వారికి  ఉంటుంది.. ముఖ్యంగా ఇదే కోరిక వారిని చిత్ర‌రంగం లో రాణించేలా చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అవుతుంది.. ఇలా చాలా మంది ఉన్నారు నిర్మాత‌ల వార‌సులుగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారు.. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.. ఇటు శాండిల్ వుడ్ లో కూడా ఇటీవ‌ల ఈ ఎంట్రీలు మ‌రింత పెరిగాయి.
 
ఇక టాలీవుడ్ లో కూడా ప్ర‌ముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్  కుమారుడు శ్రీనివాస్ కూడా మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో టాలీవుడ్ లో ఎంట‌ర్ అయ్యాడు.. అదీ కూడా భారీ బ‌డ్జెట్ తో పెద్ద  ద‌ర్శ‌కుల‌తో..  ఇటు ద‌గ్గుబాటి ఫ్యామిలీలో రానా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు..ఇటు అల్లు అర‌వింద్ కుమారులు ఇద్ద‌రూ కూడా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీతో త‌మ స‌త్తా చాటుతున్నారు..ఈ స‌మ‌యంలో మ‌రో నిర్మాత కుమారుడు వెండి తెర‌పై అల‌రించ‌నున్నార‌ట‌.. ఆయ‌నే నిర్మాత డివివి దాన‌య్య కుమారుడు.. ఇప్పుడు దాన‌య్య రెండు పెద్ద చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.. ఈ రెండు సినిమాల‌తో పాటు త‌న కుమారుడి సినీ అరంగేట్రం ప‌నులు కూడా ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ట‌.
 
ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు తేజ ఈ సినిమా క‌థ వ‌ర్క్ లో ఉన్నార‌ని తెలుస్తొంది. సొంతంగా దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఇక ఇప్ప‌టి కే డాన్స్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న ఆయ‌న కుమారుడు, టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నారు... ఇక ఆయ‌న స‌ర‌స‌న కాజ‌ల్ ని లేదా సాయిప‌ల్ల‌విని తీసుకోవాలని ఆలోచిస్తున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.