చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో టాప్ హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-12 15:20:52

చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో టాప్ హీరో

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా "ఎన్టీఆర్". తన తండ్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై చాలా శ్రద్ధ వహిస్తున్నాడు బాలకృష్ణ. బాలకృష్ణ తో ఇది వరకు "గౌతమీ పుత్ర శాతకర్ణి" వంటి సినిమాని తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
 
అయితే బాలకృష్ణ తో పాటు సీనియర్ హీరో అయిన రాజశేఖర్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో ప్రముఖ దర్శకుడు నిర్మాత అయిన ఆలూరి చక్రపాణి పాత్రలో మురళి శర్మ నటించబోతున్నాడు.
 
అంతేకాకుండా, ఈ సినిమా లో దగ్గుబాటి రానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించబోతున్నాడు అనే టాక్ ఫిలిం నగర్ లో ఉంది. అతి త్వరలో కాస్టింగ్ మొత్తం ఫిక్స్ అయితే షూట్ కి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు బాలకృష్ణ ఇంకా క్రిష్. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.