పెట్రోల్ అమ్మిన ప్ర‌ముఖ న‌టి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-04 06:10:37

పెట్రోల్ అమ్మిన ప్ర‌ముఖ న‌టి

స‌మాజంలో ఒక్క‌రై జీవిస్తున్నందుకు స‌మాజానికి మ‌న వంతు సేవ చేయాలి అనే వారు చాలా అరుదుగా ఉంటారు. ఏదో ఒక ప‌ద్ద‌తిలో  స‌మాజానికి సేవ చేసే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రూ కాద‌న‌రు. అలాంటి అవ‌కాశం టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి అనుష్కకు వ‌చ్చింది. మంచు లక్ష్మి మేము సైతం అనే టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఈ షో సీజన్‌ 1 గత ఏడాది పూర్తి అయిన  విష‌యం తెలిసిందే. అయితే ఈ యేడాది రెండో సీజన్‌ను నిర్వాహకులు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత మంచులక్ష్మి శనివారం ట్వీట్‌ చేశారు. రేపటి నుంచి మేముసైతం సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. మీ వంతు స‌హ‌కారం కావాలి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిల్మ్‌నగర్‌ రోడ్‌నంబరు 1లో అనుష్క విరాళాలు సేకరించనున్నారు. ప్ర‌తి ఒక్క‌రు వెళ్లి స‌హ‌యం చేయండి అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఈ ట్వీట్ చూసిన స్వీటి అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. అనుష్క ఫిల్మ్‌నగర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ అమ్మి, విరాళాలు సేకరిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పెట్రోల్ అమ్మే  వ్య‌క్తుల  మాదిరి దుస్తులు, టోపి ధ‌రించి, పెట్రోల్ అమ్మారు న‌టి అనుష్క‌.
 
ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన మొద‌టి సీజ‌న్‌లో...టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టులు రానా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సమంత, శ్రియ, నాని, నాగచైతన్య, లావణ్య త్రిపాఠి తదితరులు సైతం పాల్గొని విరాళాలు సేక‌రించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.