భూతులు ఆపండి అని వార్నింగ్ ఇచ్చిన త్రిష

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine trisha
Updated:  2018-09-05 17:14:11

భూతులు ఆపండి అని వార్నింగ్ ఇచ్చిన త్రిష

“వర్షం”తో తిరుగు లేని హీరోయిన్ గా మారి చిన్న హీరోలు మొదలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి పెద్ద పెద్ద హీరోల సరసన మెరిసిన చెన్నై బ్యూటీ త్రిష. దాదాపు పదేళ్ళపాటు తన హవా సాగించిన ఈ డస్కీ బ్యూటీ గత కొంత కాలంగా పనిలేక సతమతమవుతోంది.
 
ఇలాంటి గడ్డు కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ ఛాన్స్ కొట్టెసింది.ఇది కాక ఆమె తాజాగా నటించిన 96 చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ సంధర్బంగా  జరుగుతున్న ప్రమోషన్స్ లో ఓ వీరాభిమానిపై త్రిష కోపం ఆసక్తికర చర్చకు దారి తీసింది. "నా టైమ్ లైన్ లో  ఇతరులకు  అగౌరవం కలిగించే మాటలు పద్ధతి కాదు.నాకు ఫ్యాన్ అని చెప్పుకుంటూ వేరొకరిని కించపరచడం నాకేం నచ్చలేదు. హరాస్ చేయడం పద్ధతి కాదు. ఏమనుకుంటున్నావ్.. నిన్ను బ్లాక్ చేస్తా!!" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది త్రిష.
 
సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య గొడవలు సర్వసాధారణం. తమ అభిమాన తారల కంట్లో పడాలంటే వేరే వారిని కించపరిచేలా కామెంట్స్ చెయ్యడం పరిపాటే.  కానీ త్రిష విషయం లో ఇది రివర్స్ అయ్యింది. కొంత మంది తారలు చూసీచూడనట్టు వదిలేస్తే త్రిష మాత్రం ఆ అభిమానిని సోషల్ మీడియాలోనే ఎండగట్టేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.