అరవింద సమేత షూట్ ని కాన్సిల్ చేసిన త్రివిక్రమ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-08-16 11:02:14

అరవింద సమేత షూట్ ని కాన్సిల్ చేసిన త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా "అరవింద సమేత". ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ రామోజీ ఫిలిం సిటీ షెడ్యూల్ తరువాత లండన్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసాడు త్రివిక్రమ్. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ లండన్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసాడట. 
 
ఈసినిమాలోని రెండు పాటలను లండన్ లో షూట్ చేయాలి అని త్రివిక్రమ్ అండ్ కో ప్లాన్ చేసారు. కానీ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో దసరాకే రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడు. అందుకే టైం వేస్ట్ చెయ్యడం ఇష్టం లేక ఆ రెండు పాటలను ఇక్కడే చిత్రీకరించాలని భావిస్తున్నారట మూవీ యూనిట్.
 
అందుకే లండన్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. హారిక హాసిని క్రియేషన్స్ పై ఎస్.రాధ కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.