త్రివిక్రమ్ కి ఇంకా బుద్ది రాలేదా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

trivikram
Updated:  2018-09-12 12:42:36

త్రివిక్రమ్ కి ఇంకా బుద్ది రాలేదా ?

‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలకు ముందే పైరసీ మహమ్మారిన పడి నిర్మాతలకు గుండెల నొప్పులు తెప్పించింది. అయితేనేం ఆ చిత్రం విడుదల తర్వాత కూడా వంద కోట్లు బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ అంటే ఎంటో చెప్పింది. కానీ త్రివిక్రమ్ మ్యాజిక్ కొన్నాళ్లుగా వర్క్ అవ్వడం లేదు. ఎందేందు వెతికిన అందదు కలడు అన్నట్టు పరాజయం ప్రతీ చోటా పలకరిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా త్రివిక్రమ్ రేంజ్ బిజినెస్ జరుగుతుంది.

దానికి ఉదాహరణ ‘అరవింద సమేత’. ఎంత బిజినెస్ జరిగినా ఖర్చు మాత్రం బాగా ఉంటుందని సినీ వర్గాల గుసగుసలు.‘అజ్ఞతవాసి’ వేసిన మొట్టికాయలు చాలవన్నట్టు ఇప్పుడు అరవింద సమేత కి కూడా అదే రేంజిలో ఖర్చు పెట్టిస్తున్నాదంట!హీరోతో కలుపుకుని ఇద్దరి పారితోషికాలు మరియు ఈ చిత్ర నిర్మాణ వ్యయమే వంద కోట్లకి తక్కువ అవదని, థియేట్రికల్‌ బిజినెస్‌ ద్వారా వచ్చేది కేవలం ఖర్చులకే పోతుందని, శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ ద్వారా వచ్చేదాంట్లోనే నిర్మాతకి మిగులుతుందని చెబుతున్నారు.

భారీ నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్‌ వున్న చిత్రాలకి అంత ఖర్చయితే ఓకే కానీ సాధారణ ఫ్యామిలీ సినిమాలకి కూడా త్రివిక్రమ్‌ అదే స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టించేయడమే నిర్మాతకి తలపోటు. అన్నీ కలిసి వచ్చినపుడు ఒకే కానీ అజ్ఞాతవాసిలా రివర్స్‌ అయితేనే నిర్మాతకి నష్టమే. 

షేర్ :