అరవింద సమేత లో అంత దమ్ము లేదా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-08-18 16:34:24

అరవింద సమేత లో అంత దమ్ము లేదా..?

జూనియర్ ఎన్టీఆర్ ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా "అరవింద సమేత". ఈ సినిమా యొక్క టిజర్ ఇటివలే రిలీజ్ అయ్యి మాస్ లో మంచి ఆదరణ తెచ్చుకుంది. అయితే ఈ టిజర్ లో చాలా మటుకు త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది అని అంటున్నారు త్రివిక్రమ్ ఫ్యాన్స్. ఎందుకంటే త్రివిక్రమ్ మార్క్ టిజర్ అనగానే అందరికి మంచి పంచ్ లు చమత్కారమైన మాటలు గుర్తొస్తాయి.

కానీ "అరవింద సమేత" టిజర్ లో ఇవేవి లేవు పైగా ఈ టిజర్ ని ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపెసాడు త్రివిక్రమ్. పైగా ఎన్టీఆర్ తో చాలా కాలం తరువాత కత్తి పట్టించి పక్కా యాక్షన్ సినిమాని తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. టైటిల్‌పై తన ముద్ర చాటుకున్న త్రివిక్రమ్‌ టీజర్‌లో మాత్రం తన ఉనికి లేకుండా చేసుకున్నాడు.

ఓవర్సీస్‌ బిజినెస్‌ క్లోజ్‌ అవడం వలనే ఇలాంటి టీజర్‌ కట్‌ చేసారనే కామెంట్లు పడుతున్నాయి. లోకల్‌గా డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆకట్టుకోవడానికి ఇలా యాక్షన్‌ టీజర్‌ కట్‌ చేసారని, ఓవర్సీస్‌ బిజినెస్‌ అవకపోయినట్టయితే ఇలాంటి టిజర్ ని కట్ చేసే వారు కాదని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.