ఎన్టీఆర్ కు త్రివిక్ర‌మ్ టార్గెట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and trivikram
Updated:  2018-06-22 11:17:12

ఎన్టీఆర్ కు త్రివిక్ర‌మ్ టార్గెట్

విభిన్న క‌థ‌ల‌ను తెర‌కెక్కించే మాటల మాంత్రికుడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్.. ఇప్పుడు ఆయ‌న తారక్ తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.. అయితే తారక్ సినిమాలో ఆయ‌న స‌రికొత్త పందాలో ముందుకు వెళుతున్నారు అని తెలుస్తోంది..ఎప్పుడూ చాలా నెమ్మ‌దిగా చిత్రాల‌ను తాను అనుకున్న విధంగా తెర‌కెక్కిస్తారు త్రివిక్ర‌మ్.. అయితే ఇప్పుడు తారక్ సినిమాని  జెట్ స్పీడ్ వేగంతో పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ అరవింద సమేత పై ఇప్ప‌టికే టాలీవుడ్ లో ఓ రేంజ్ లో చ‌ర్చ జ‌రుగుతోంది.. ఆ చ‌ర్చ‌లో వేగంగా పూర్తి అవుతున్న షూటింగ్ పై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.
 
ఈ సినిమాకి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తి అయింది..ఓ పక్క డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి అవుతున్నాయి..ప్రొడ‌క్ష‌న్ మ‌రియు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు రెండూ శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్... అయితే ఈ సినిమాని ద‌స‌రాకి విడుదల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది..ఈ సినిమా షూటింగ్ ని సెప్టెంబ‌ర్ లో పూర్తి చేసి ద‌స‌రాకి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు చిత్ర యూనిట్... 
 
ఎట్టి ప‌రిస్దితుల్లో ద‌స‌రాకి సినిమా విడుద‌ల అని టార్గెట్ పెట్టుకున్నారు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్.. ఈ సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో రానుంది..హారిక అండ్ హాసీనీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఎస్ రాథాకృష్ణ నిర్మిస్తున్నారు...పూజా హెగ్డే ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే..త‌మ‌న్ బాణీలు ఈసారి ఎన్టీఆర్ కు ఎటువంటి మ్యూజిక‌ల్ హిట్ ఇస్తాయో చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.