సోషల్ మీడియా లో వీళ్ళ రొమాన్స్ చూడలేకపోతున్నాం..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rakul and manchu lakshmi
Updated:  2018-10-10 12:28:43

సోషల్ మీడియా లో వీళ్ళ రొమాన్స్ చూడలేకపోతున్నాం..

ఇద్దరు హీరోయిన్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండలేరు అని జనాలు పలురకాలుగా మాట్లాడుకుంటుంటే, మరోవైపు టాలీవుడ్ లో పరిస్థితి మరోలా ఉంది. ఇద్దరు నటీమణులు మధ్య స్నేహం అవధులు దాటేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటినుండో మంచి స్నేహితులు.

ఇక ఈమధ్యనే మంచు లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా వేడుక చేసుకోడానికి లక్ష్మీ, రకుల్ అలాగే నీరజ కోన శ్రీలంక వెళ్లారు.లంక లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగారు రకుల్, మంచు లక్ష్మి. ఆ ఫోటోలే ఇప్పుడు వారి కొంప ముంచాయి. ఒక ఫొటోలో రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి ని వెనుక నుండి కౌగలించుకుని ముద్దు పెడుతున్నట్టు పోజ్ ఇచ్చింది. రకుల్ సోషల్ మీడియా లో షేర్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇద్దరూ మహిళలు అయ్యుండి అంత క్లోజ్ గా ఫోటో లు దిగడమేంటి మళ్ళీ అవి సోషల్ మీడియా లో పంచుకోవడం ఏంటి ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో వీరి రొమాంటిక్ పోజులు చూడలేకపోతున్నాం అని వాపోతున్నారు. ఇన్ని జరుగుతున్నా ఈ ఇద్దరు మాత్రం సైలెంట్ గా వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.