బిగ్ బాస్ లో చివరి క్షణాల్లో దీప్తి స్థానం మారిందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

deepthi
Updated:  2018-10-02 04:50:25

బిగ్ బాస్ లో చివరి క్షణాల్లో దీప్తి స్థానం మారిందా..?

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో, తెలుగు మీడియాలో ఒకటే హాట్ టాపిక్ బిగ్ బాస్, బిగ్ బాస్... మొదటిరోజు నుండి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నూట పది రోజులు తెలుగు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్... అయితే బిగ్ బాస్ అయ్యాక కూడా ఈ షో మీద వివాదం ఇంకా నడుస్తూనే ఉన్నాయి... గతంలో ఎన్. టి.ఆర్ హోస్ట్ గా చేసిన దానికి నాని అంతగా మెప్పించలేడని, నూతన్ నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఓటింగ్స్ బట్టి ఎలిమినేషన్ ఉండట్లే అని ఇలా వివాదాలు ఉండేవి..
 
ఇప్పుడు తాజాగా టి.వి 9 యాంకర్ దీప్తి వివాదం.. అసలు ఓటింగ్స్ చూస్తే కౌశల్ తరువాత దీప్తి తరువాతి స్థానం లో నిలుస్తుంది అనుకున్నారు అందరూ.. ఓటింగ్స్ బట్టి దీప్తి ఏ రన్నర్ అప్ అనుకున్నారు అంతా.. కానీ చివరి క్షణాల్లో దీప్తి సన్నిహితులు, సోషల్ మీడియా ఫాన్స్ ఫేక్ ఓట్లు వేశారని తేలిందని, అందుకే విమర్శలకి తావు ఇవ్వకుండా గీత మధురిని రన్నర్ అప్ గా ప్రకటించారని తెలుస్తుంది..
 
ఈ సీజన్ చివరి వారం మొత్తం కూడా కౌశల్ మరియు దీప్తిల మద్య హోరా హోరీ అంటూ ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో కౌశల్ కంటే ఎక్కువగా దీప్తికి ఓట్లు పోల్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. కానీ ఫేక్ ఓటింగ్ వల్ల దీప్తి నాల్గవ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. దీని వల్ల దీప్తి కి అన్యాయం చేసారంటూ, దీప్తి వర్గం వాళ్ళు, సోషల్ మీడియాలో జనాలు వాపోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.