ఆ నటి నన్ను లైంగికంగా వేధించింది..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mee too
Updated:  2018-11-01 05:50:56

ఆ నటి నన్ను లైంగికంగా వేధించింది..

మీటూ ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో మొదలై, బాలీవుడ్ లో కలకలం రేపి, దక్షిణాది కి పాకి, కొందరి బడా బడా బాబుల కళ్ళ మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది తారలు తమ పై జరిగిన లైంగిక దాడుల కోసం, తాము ఎదుర్కొన్న వేధింపులు కోసం మీడియా ముందు చెప్పారు. స్టార్ హీరో లను సైతం మీటూ సెగ తాకింది.దక్షిణాది లో స్టార్ హీరో అయిన అర్జున్ పై కూడా ఒక హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేసింది.

అయితే ప్రస్తుతం ఒక తమిళ నటి చేసిన ఆరోపణలు సంచలనం గా మారాయి. ఇంతకీ ఆ నటి ఆరోపణలు చేసింది ఏ హీరో , దర్శకనిర్మాతల పై కాదు. సాటి నటి పై ఈ భామ ఆరోపణలు చేసింది.తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా 2.ఓ లో చిన్న పాత్రలో నటించిన నటి మయా ఎస్.కృష్ణన్ పై మరో నటి అనన్య రామ్ ప్రసాద్ లైంగిక ఆరోపణలు చేసింది.

లెస్బియన్ రిలేషన్ కు తనను బలవంతపెట్టిందని తీవ్ర ఆరోపణలు చేయడం కోలీవుడ్ లో కలకలం రేపుతోంది.మాయ అంతకుముందు తొడరి, మగళిర్ ముట్టుమ్, వెట్టైక్కారన్ తదితర సినిమాల్లో నటించగా త్వరలో విడుదల కాబోతున్న రజనీకాంత్ 2. ఓ లోను చిన్న పాత్రలో నటించింది.ఇప్పటి వరకు మగవారి పై మాత్రమే ఆరోపణలు రాగా, ఇది మీటూ లో సరికొత్త ట్విస్టు అంటూ గుసాగుసలాడుతున్నారు కొందరు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు