ఎన్టీఆర్ బ‌యోపిక్ లో స‌రికొత్త ట్విస్ట్ మ‌రో స్టార్ హీరో ఎంట్రీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr bio pic
Updated:  2018-06-29 04:39:19

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో స‌రికొత్త ట్విస్ట్ మ‌రో స్టార్ హీరో ఎంట్రీ

నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని టాలీవుడ్ కు చెందిన ఇద్ద‌రు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు రామ్ గోపాల్ వ‌ర్మ‌, క్రిష్ తెర‌పైకి తీసుకుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వ‌ర్మ తెర‌కెక్కించ‌బోతున్న చిత్రానికి ల‌క్ష్మీస్ అనే టైలిల్ ను ఖ‌రారు చేసింది చ‌త్ర యూనిట్ ఇక క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్నసినిమాకు ఎన్టీఆర్ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. 
 
వాస్త‌వానికి ఎన్టీఆర్ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలి కానీ కొన్ని అనివార్య‌కార‌ణాల వ‌ల్ల తేజ ద‌ర్శ‌క భాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్నారు. క్రిష్ ఎప్పుడు అయితే సినిమా బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్నారో అప్ప‌టి నుంచి సినిమా పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కథను ఫైనల్ చేసే పనిలో ఉన్న క్రిష్. ఇక‌ నటీనటుల ఎంపిక మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 
 
రామారావు స‌మ‌కాలిన న‌టుల పాత్ర‌లో న‌టించేందుకు స్టార్ హీరోల‌ను ఎంపిక చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో ముఖ్యంగా కృష్ట‌ పాత్రలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు, ఏ ఎన్నార్ పాత్ర‌లో నాగచైతన్య కనిపిస్తారన్న వార్త‌లు వ‌చ్చాయి.
 
కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఏ ఎన్నార్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌కు బ‌దులుగా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక‌రిని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇలీవ‌లే విడుద‌ల అయిన మళ్ళీరావా అనే స‌క్సెస్ తో ఫామ్ లో ఉన్న సుమంత్ ను ఎంపిక చేసేందుకు చిత్ర‌యూనిట్ ఆలోచిస్తోందని వార్త‌లు వ‌స్తున్నాయి. చూడాలి మ‌రి ఇంకా అధికార ప్ర‌క‌ట‌న మాత్రం బ‌య‌టికి రాలేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.