చెర్రి భార్య‌ను భ‌య‌పెట్టిన అనుష్క‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-02 02:17:18

చెర్రి భార్య‌ను భ‌య‌పెట్టిన అనుష్క‌

అనుష్క న‌టించిన లేడి ఓరియంటేడ్  భాగ‌మ‌తి చిత్రం ఇటీవ‌ల విడుదలై ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం అంద‌రికి  తెలిసిందే. ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరు అద్బుతం అని చెప్ప‌వ‌చ్చు. భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడు అశోక్ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోతుంది.  ఒక వైపు క‌లెక్ష‌న్ల  వ‌ర్షం కురిపిస్తూ.... మ‌రో వైపు  సినిమా చూసిన ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందుతోంది.
 
భాగ‌మ‌తి సినిమా చూసిన ప్ర‌ముఖులు  అనుష్క న‌ట‌న అల్టిమేట్ అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ చిత్రం పై తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. భాగమతి చిత్రం చూశానంటూ తాజాగా చరణ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అనుష్క మైండ్ బ్లోయింగ్ న‌ట‌న‌తో ఆకట్టుకుంది.... ఈ సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి సాంకేతిక నిపుణిడికి శుభాకాంక్ష‌లు తెలిపారు హీరో రామ్‌చ‌ర‌ణ్‌.
 
భాగ‌మ‌తి సినిమా చూసిన రాత్రి  నా భార్య ఉపాస‌న నిద్ర‌పొలేదు. సినిమా వాళ్ల‌కి ధన్యవాదాలు అంటూ చరణ్ తన ఫేస్‌బుక్ పేజీలో భాగమతి గురించి పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన భాగమతి టీమ్‌ జనాలకు నిద్రపోనివ్వకూడదనేదే మా లక్ష్యం అని...మా క‌ష్టాన్ని గుర్తించినందుకు ధ‌న్య‌వాదాలంటూ స‌మాధానం ఇచ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.