ప్రేమికుల రోజు సెలవు ప్ర‌క‌టించిన విశ్వ‌విద్యాల‌యం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-13 05:16:28

ప్రేమికుల రోజు సెలవు ప్ర‌క‌టించిన విశ్వ‌విద్యాల‌యం

ప్రేమికుల రోజు సెలవు ప్ర‌క‌టించ‌డం ఏంటి అని అనుకుంటున్నారా? అది కూడా విశ్వ‌విద్యాల‌యం ఏమిటా అని మీ డౌటా? అవును నిజ‌మే..... మ‌న దేశ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కాపాడుతూ దేశ ఔన్న‌త్యాన్ని విశ్వ‌వ్యాప్తంగా చాటాల్సిన బాధ్య‌త దేశ ప్ర‌జ‌ల‌ది. మ‌న‌ దేశ ఆచారాలు, జీవ‌న శైలి న‌చ్చి ప‌రాయి దేశాల‌వారు కూడా పాటిస్తూ, దేశ గొప్ప‌త‌నాన్ని చాటుతున్నారు. 
 
ప్ర‌స్తుతం పాశ్చ్యాత్య సంస్కృతికి అల‌వాటు ప‌డ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు భార‌తదేశ ప్ర‌జ‌లు.... అందులో భాగం అయిన‌ ప్రేమికుల రోజును గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భార‌తదేశ యువ‌కులు జ‌రుపుకుంటున్నారు. ఈ ప‌ద్ద‌తికి చ‌ర‌మ‌గీతం పాడింది ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధానిలోని లఖ్‌నవూ విశ్వవిద్యాలయం. ప్రేమికుల రోజు జరుపుకోకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసి, విశ్వ‌విద్యాల‌యానికి సెలవు ప్ర‌క‌టించింది యాజ‌మాన్యం... సెలవు రోజున ఎటువంటి ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు,ల్యాబ్‌లు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారి చేసింది.
 
అలాగే  త‌ల్లిదండ్రులు కూడా ప్రేమికుల రోజున‌ విద్యార్థులను బ‌య‌ట‌కు పంప‌వ‌ద్ద‌ని సూచించింది. ఎవరైనా విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో కనిపిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని నోటీసుల ద్వారా హెచ్చరించింది. దేశ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తూ, నైతిక విల‌వ‌లు ఉన్న‌టువంటి యువ‌కుల‌ను దేశానికి అందిస్తున్న లఖ్‌నవూ విశ్వవిద్యాలయానికి హ్యాట్సాఫ్‌.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.