డబ్బిస్తే వాళ్లు ఏమైనా చేస్తారు..వ‌ర‌ల‌క్ష్మి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

varalakshmi
Updated:  2018-09-04 01:22:02

డబ్బిస్తే వాళ్లు ఏమైనా చేస్తారు..వ‌ర‌ల‌క్ష్మి

తమిళ నటుడు విశాల్ పెళ్లి గొడవ తెర మీదకు రాగానే వినిపించే మొట్టమొదటి పేరు వరలక్ష్మి. ఈ పెళ్లి గొడవ పక్కన పెట్టి అటు విశాల్ తన సినిమాలతో బిజీ గా ఉన్నాడు ఇటు ఈ వరలక్ష్మి కూడా తనకు తోచిన సినిమాలు చేస్తూ సంపాదనలో పడింది. ఈమె ఈమధ్య రివ్యూల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

“ఎచ్చరికై - ఇదై మనిదరలగళ్ నడమాడుమ్” ఈమె నటించిన తాజా చిత్రం. వరలక్ష్మి తో పాటు సత్యరాజ్ లాంటి పేరున్న నటుడు ఇందులో ఉండటం వల్ల ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే రివ్యూలు మాత్రం కొంచెం నెగటివ్ గా రాశారు రివ్యూ రాజాలు. అది ఈ అమ్మడికి అస్సలు నచ్చలేదు.

ప్రేక్షకుల స్పందనతో చాలా సంతోషంగా ఉన్నానని తెలుపుతూనే రివ్యూ రాసేవారిపై విరుచుకుపడ్డారు ఈ హీరోయిన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే వల్ల మొహాన కొన్ని డబ్బులు పడేస్తే రివ్యూలు బాగా రాసేస్తారని, మనం డబ్బివ్వకపోతే మన సినిమా ఎంత బాగున్నా నెగెటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తారని ఆరోపించింది. ప్రేక్షకులు ఇలాంటి ధోరణికి స్వస్తిపలకాలని ఆమె కోరింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.