వ‌ర్మ బాధ‌ వ‌ర్ణ‌నాతీతం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram-gopal-varma-sridevi
Updated:  2018-02-25 04:47:18

వ‌ర్మ బాధ‌ వ‌ర్ణ‌నాతీతం

ప్రముఖ న‌టి శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణ వార్త విన‌గానే అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన న‌టీన‌టులే కాకుండా రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు..... అయితే ఈ నేప‌థ్యంలో త‌న అభిమాన న‌టి శ్రీదేవి మ‌ర‌ణంతో విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ ల మీద ట్వీట్ లు చేస్తూనే ఉన్నారు.
 
!!క్ష‌ణ‌క్ష‌ణం!! చిత్రంలో శ్రీదేవి ఏడ్చిన ఫోటోను వ‌ర్మ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు... శ్రీదేవి నీవేందుకు ఏడుస్తున్నావ్ నీవు మ‌మ్మ‌ల్నంద‌రిని వ‌దిలి వెళ్లినందుకు మేము ఆ ప‌ని చేస్తున్నాము అంటూ పోస్ట్ చేశారు వ‌ర్మ‌...
 
మ‌రో ట్వీట్ లో పేర్కొంటూ.. దేవుడిని ఈ రోజు ద్వేషించినంత‌గా మ‌రే నాడు ద్వేషించ‌లేద‌న్నారు వ‌ర్మ‌... శ్రీదేవి తాను ఉన్నంత కాలం త‌న‌కు ఆరాధ్య దైవ‌మ‌ని, ఉజ్వ‌ల‌మైన దీపాన్నీ దేవుడు ఆర్పేశార‌ని తెలిపారు వ‌ర్మ‌.... తాను తెర‌కెక్కించిన సినిమా త‌న పైనే పెను ప్ర‌భావం చూపింద‌ని, కానీ !!క్ష‌ణ‌క్ష‌ణం!! చిత్రం మాత్రం శ్రీదేవి ప్ర‌భావం చూపింద‌ని ట్వీట్ చేశారు వ‌ర్మ‌.
 
అలాగే ఈ సినిమా షూటింగ్ లో వెంక‌టేష్ శ్రీదేవిలు డాన్స్ చేస్తున్నారు... ఆ స‌మ‌యంలో నేను మానిట‌ర్ చూస్తూ షాట్ ఒకే అన్నా ! ప‌క్క‌న ఉన్న డాన్స్ మాస్ట‌ర్ క‌ట్.. క‌ట్.. అని అన్నారు... నేను రెండోసారి షాట్ ఒకే అన్నా! మ‌ళ్లీ వ‌న్ మోర్ టైమ్ అన్నారు డాన్స్ మాస్ట‌ర్.... నేను ఆ టైమ్ లో నా స‌హాద‌ర్శ‌కుడిని పిలిపించి ఎందుకు ప్ర‌తీ సారి క‌ట్.. క‌ట్ అంటున్నారు అంతా బాగానే ఉంది క‌దా అని అడిగార‌ట వ‌ర్మ... దీనికి స‌హద‌ర్శ‌కుడు స‌మాధానం ఇస్తూ.. రాము, మీరు శ్రీదేవిని చూస్తున్నారు.... డాన్స్ మాస్ట‌ర్ ఏమో వెంక‌టేష్ ను చూస్తున్నార‌ని చెప్పారు.... !!క్ష‌ణ‌క్ష‌ణం!!  సినిమా షూటింగ్ మొత్తంలో శ్రీదేవిని చూస్తూ ఉండిపోయాన‌ని ట్వీట్ చేశారు వ‌ర్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.