వర్మ జీఎస్టీ షూటింగ్ పిక్స్ లీక్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-23 05:03:11

వర్మ జీఎస్టీ షూటింగ్ పిక్స్ లీక్

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ వ‌ర్మ‌....ఆయ‌న తీసిన ప్ర‌తి సినిమా ఏదో ఒక సంచ‌ల‌నం రేపుతూనే ఉంటుంది. ఇటీవ‌ల క‌డ‌ప వెబ్ సిరీస్ తో ప్రధాన వార్త‌ల్లో నిలిచిన వ‌ర్మ‌.. తాజాగా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తో తెలుగు రాష్ట్రాల్లో  వివాదాస్ప‌దంగా మారారు. పోర్న్ స్టార్ మియా మాల్కొవాపై వ‌ర్మ తీస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తు నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌హిళా సంఘాలు జీఎస్టీ సినిమాను వ్య‌తిరేకిస్తూ.... వ‌ర్మాపై చ‌ర్య‌లు తీసుకోవాలని కోరుతూ  పోలీస్ స్టేష‌న్ లో కేసులు కూడా న‌మోదు చేస్తున్నారు. 

ఈ క్ర‌మంలో జీఎస్టీకి సంబంధించి మ‌రో వివాదం తెర‌పైకి వ‌చ్చింది.వ‌ర్మ  ఈ షార్ట్ ఫిల్మ్   చిత్రీక‌ర‌ణ చేస్తున్న స‌మ‌యంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  ఈ ఫోటోలు లీక్ కావ‌డంతో మ‌రోసారి  జీఎస్టీపై దుమారం రేగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.