వ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-31 02:54:51

వ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

సంచ‌ల‌నానికి మారు పేరు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఎవ‌రైన ఉన్నారు అంటే అది ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ‌. క‌డ‌ప వెబ్ సీరిస్‌తో వివాదాల‌ను ఎదుర్కొన్న రామ్‌గోపాల్‌వ‌ర్మ  పోర్న్‌స్టార్‌ మియా మాల్కోవా ముఖ్య తారగా గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్ జీఎస్టీ అంటు ఒక‌ ల‌ఘు చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే ఈ చిత్రం వివాదాల న‌డుమ రిలీజ్ అయిన విష‌యం అంద‌రికీ తెలుసు.
 
జీఎస్టీ చిత్రానికి  మంచి స్పంద‌న  వ‌స్తోందంటూ వర్మ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. అయితే ఈ చిత్రం పై ఎన్ని వివాదాలు జ‌రిగినా, ఎంత మంది విమర్శంచినా వారికి స‌మాధానం చెబుతూనే  ఎదురుదాడి చేశారు ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌.  జీఎస్టీ విడుద‌లైన త‌రువాత గూగుల్‌లో మియా గురించి జీఎస్టీ సినిమా గురించి ఎంతమంది సెర్చ్‌ చేస్తున్నారు..? టీవీ ఛానళ్లు నిర్వహించే పోలింగ్‌లో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ మద్దతుగా ఎంతమంది ఓటేస్తున్నారో, ఎంతమంది మాట్లాడుతున్నారో...... చూపించి దీనికి మీ స‌మాధానం ఏమంటూ విమ‌ర్శ‌కుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు వ‌ర్మ‌.
 
జీఎస్టీకి సినిమాకు వ‌చ్చిన అద‌ర‌ణ‌ను చూసిన త‌రువాత...నేను జీఎస్టీకి మ‌రో సీక్వెల్‌ను  తెర‌కెక్కించాల‌నుకుంటున్న‌ట్లు  రామ్ గోపాల్‌వ‌ర్మ  మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి వ‌ర్మ ప్ర‌క‌ట‌న‌తో  జీఎస్టీ వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేలా క‌నిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.