ఆ దర్శకుడిని అసిస్టెంట్ పోస్ట్ అడుగుతున్న వర్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rgv
Updated:  2018-07-14 11:52:40

ఆ దర్శకుడిని అసిస్టెంట్ పోస్ట్ అడుగుతున్న వర్మ

రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సరైన బాక్స్ ఆఫీస్ హిట్ లేక ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇటివలే ఆయన డైరెక్ట్ చేసిన "ఆఫీసర్" సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చూసింది. ప్రస్తుతం వర్మ తన నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు.
 
అయితే ఇలాంటి సమయం లో వర్మ "RX100" సినిమా చూసాడు. వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అజయ్ భూపతి ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాని చూసి థ్రిల్ అయిన వర్మ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధిస్తుంది అని చెప్పాడు.
 
అలాగే అజయ్ భూపతి తన నెక్స్ట్ మూవీ ని నన్ను అసిస్టెంట్ గా తీసుకోవాలి అని కూడా కోరాడు. వర్మ ఈ సినిమా పై ఇలాంటి కామెంట్స చేయడంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమా పై పడ్డాయి. మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజే 1.42కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈ సినిమా తప్పకుండా పది కోట్ల వరకు వసూలు చేస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.