కొత్త ట్విస్ట్ ఇచ్చిన ఆర్ జీ వి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

varma
Updated:  2018-10-22 11:11:28

కొత్త ట్విస్ట్ ఇచ్చిన ఆర్ జీ వి

రామ్ గోపాల్ వర్మ.. టాలీవుడ్ లోనే సంచలనాత్మక దర్శకుడిగా ఈయన పేరు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా లో ఎవరి గురించి ఎలా చూపించనున్నాడు ఆమెది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఈ సినిమాలో విలన్ చంద్రబాబు నాయుడు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

దానికి స్పందిస్తూ, తాను తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లో విలన్లు అంటూ ఎవరూ ఉండరని వర్మ కొత్త షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని కలిశాక ఏం జరిగిందనేది మాత్రమే తాను చూపిస్తానని, ఇందులో ఎన్టీఆర్ గురించి వ్యతిరేకంగా మాత్రం ఉండదని హామీ ఇచ్చాడు. అలాగే ఎన్టీఆర్ చనిపోయే ముందు ఒక సభలో లక్ష్మీ పార్వతి గురించి చాలా గొప్పగా చెప్పారని, ఆమె గురించి కూడా తన సినిమా లో నెగెటివ్ గా ఉండదని వర్మ స్పష్టం చేశాడు.

అయితే అందరూ అనుకున్నట్టు చంద్రబాబును విలన్ గా చూపించను కానీ ఎన్టీఆర్ అధికారం కోల్పోయాక జరిగిన సంఘటనలతో ఎవరెవరు ఏం చేశారని మాత్రం కచ్చితంగా చూపిస్తానని, దాన్ని బట్టి ప్రేక్షకులే నిర్ణయించుకోవాలని వర్మ బల్ల గుద్ది చెబుతున్నాడు. మరి ఒకరకంగా చంద్రబాబు విలన్ గా నే కనిపిస్తాడు అని తెలుస్తోంది. చూద్దాం ఈ సినిమా ద్వారా వర్మ ఎన్టీఆర్ జీవితాన్ని మనకు అద్దం పడతాడా లేక వివాదాల్లో ఇరుక్కుంటాడా అని.

షేర్ :