వెంకయ్యకు నచ్చిన చినబాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

venkaiah naidu
Updated:  2018-07-19 12:54:06

వెంకయ్యకు నచ్చిన చినబాబు

తమిళ నటుడు కార్తీ హీరోగా తెరకెక్కిన చిత్రం "కడైకుట్టి సింగం" ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఇక ఈ చిత్రం "చినబాబు" పేరుతో ఇటీవలే తెలుగు విడుదలై తెలుగులోను మంచి వసూళ్లను సాధిస్తోంది.
 
ఇక ఈ చిత్రం గురించి చాలా మంది ప్రముఖులు స్పందిస్తుండగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ చిత్రం గురించి స్పందించారు." రైతు కష్టాలను సున్నితంగా చర్చిస్తూనే ఒక ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, అలకలు, కోపాల్ని తెరపై అందంగా చూపించారు దర్శకుడు.
 
కమర్షియల్ చిత్రాలు  ఎక్కువగా వస్తున్న ఈ టైంలో  పాండిరాజ్‌ ఇలాంటి కథను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ" ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిత్రబృందాన్ని అభినందించారు. ఇక ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కార్తీ ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.