నితిన్ కి సాయం చేస్తున్న వెంకటేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

venkatesh and nithin
Updated:  2018-08-04 03:48:01

నితిన్ కి సాయం చేస్తున్న వెంకటేష్

నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "శ్రీనివాస కళ్యాణం". స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసాడు. ఇటివలే ఈ సినిమా యొక్క ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసాడు, మహేష్ లాంచ్ చేసిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు.
 
ఈ సినిమాలో స్టార్టింగ్ లో వెంకటేష్ వాయిస్ ని ఒక చక్కటి డైలాగ్ తో జత చేసారు అంట మూవీ యూనిట్. అలాగే సినిమా చూసిన వెంకటేష్ మూవీ చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు అని డైరెక్టర్ సతీష్ ని మెచ్చుకున్నాడు అట.
 
రాశి ఖన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఆగష్టు 9 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. "శతమానంభవతి" సినిమా లాగే ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకంతో దిల్ రాజు ఉన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.