మరో వివాదంలో విజయ్ దేవరకొండ చిత్రం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay
Updated:  2018-09-25 12:10:27

మరో వివాదంలో విజయ్ దేవరకొండ చిత్రం

విజయ్ దేవరకొండ తన సినిమా రిలీజ్ అయ్యేముందు కావాలనే ఇదొక వివాదం సృష్టిస్తున్నాడేమో అని అనుమానంగా ఉందని సినీవర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ వివాదం వల్ల సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ దొరకడంతో పాటు అన్ని వివాదాలు వచ్చే సీన్స్ ఏమున్నాయబ్బా అని థియేటర్ కి జనాలని రప్పించే స్ట్రాటజీ ఇంకొకటి. మొదట “అర్జున్ రెడ్డి” ఆ సినిమా గురించి చెప్పక్కర్లేదు.“ఛిల్ల్ తాత” అనే పదం ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. 

ఆ తర్వాత మొన్న విదుదల అయినా “గీతగోవిందం” రిలీజ్ కి ముందే లీకుల భారిన పడి వివాదానికి దారి తీసింది.తాజాగా ఇప్పుడు విజయ్ కొత్త సినిమా ‘నోటా’ విషయంలోనూ ఒక కాంట్రవర్శీ నడుస్తోంది. ఈ చిత్రానికి మాటలు అందించిన ‘శశాంక్ వెన్నెలకంటి’ తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా ముందుకొచ్చాడు. ‘నోటా’ తెలుగు వెర్షన్ కోసం తనతో చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ మాటలు రాయించుకున్నాడని.. కానీ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో తన పేరుని తొలగించారని ఆరోపణలు చేస్తున్నాడు.

కథ, స్క్రీన్ ప్లేతో పాటు మాటల క్రెడిట్ కూడా ఆనంద్ శంకరే వేసుకున్నాడని.. ఐతే ట్రైలర్లో వినిపించిన డైలాగులు తాను రాసినవే అని శశాంక్ మీడియా తో పేర్కొన్నాడు.  తనతో చేయించుకున్న పనికి డబ్బులిస్తే సరిపోదని, తనకి తాను చేసిన పని తాలూకు క్రెడిట్ కూడా కావాలని లేని పక్షంలో సినిమా విదుదలకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోనని అంటున్నాడు శశాంక్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.