విజయ్ దేవరకొండకి అంతగా నచ్చిన ఆ అమ్మాయి ఎవరు?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay
Updated:  2018-08-20 05:50:14

విజయ్ దేవరకొండకి అంతగా నచ్చిన ఆ అమ్మాయి ఎవరు?

సెన్సేషనల్ స్టార్ అయిన విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో ఎంత క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ అని సౌత్ ఇండియా లో ఉండే అమ్మాయిలు అందరూ ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటారు. కానీ విజయ్ దేవరకొండకి మాత్రం ఒక అమ్మాయి అంటే విపరీతమైన ఇష్టం అంట.

తాజాగా ఇచ్చిన ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌రమైన అంశాన్ని ప్ర‌స్తావించారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టివ‌ర‌కూ మీకు ప‌రిచ‌య‌మైన అమ్మాయిల్లో.. అమ్మాయి అంటే ఇలా ఉండాల్రా? అనిపించిన అమ్మాయి ఎవ‌రైనా ఉన్నారా? అన్న ప్ర‌శ్న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ తనకి నచ్చిన అమ్మాయి గురించి చెప్పుకొచ్చాడు. అమ్మాయి అంటే ఇలా ఉండాల‌ని తాను అనుకోన‌ని.. ఎందుకంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఒక్కో స్టైల్ ఉంటుంద‌న్నారు. ఒక‌రిలా మ‌రొక‌రు ఉండ‌లేర‌ని. త‌న జీవితంలో ఒక అమ్మాయి ఉంద‌ని.

తాను నటుడు కాక‌ముందు నుంచే ఆ అమ్మాయితో పరిచయం ఉంది అని. అన్ని విషయాల్లో విజయ్ కి చాలా సపోర్ట్ గా ఆ అమ్మాయి నిలిచింది అని విజయ్ చెప్పుకొచ్చాడు. అందరి అమ్మాయిల మాట ఏమోగాని ఆ అమ్మాయి మాత్రం దేవత అని చెప్పి ఆ అమ్మ్మయిని ఆకశానికి ఎత్తేశాడు ఈ స్టార్ హీరో. ఇంత‌కీ ఆ అమ్మాయి ఎవ‌రు అన్న‌ది ఇప్పుడు ఫిలిం నగర్ లో ఆస‌క్తిక‌రంగా మారింది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.