విజయ్ దేవరకొండ బిహేవియర్ కి షాక్ అయిన అభిమాని

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-10 18:33:08

విజయ్ దేవరకొండ బిహేవియర్ కి షాక్ అయిన అభిమాని

విజయ్ దేవరకొండ....ఇప్పుడు యూత్ లో ఎక్కడ చూసిన ఈ పేరే. కేవలం "అర్జున్ రెడ్డి" అనే ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ తో పాటు కోట్లల్లో అభిమానుల్ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చే అభిమానులు కోట్లల్లో ఉన్నారు.

అయితే ఇటివలే ఒక అభిమానికి మాత్రం విజయ్ దేవరకొండ అదిరిపోయే షాక్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ని ప్రాణంగా అభిమానించే రోహిత్ అనే యువకుడు ఇటివలే విజయ్ దేవరకొండ ఒక ధియేటర్ లో సినిమా చూస్తున్నాడు అని తెలిసి తన సొంత ఊరి నుంచి హైదరబాద్ కి వచ్చాడు, కాని అక్కడికి వచ్చాక విజయ్ దేవరకొండ బౌన్సర్స్ రోహిత్ ని విజయ్ దగ్గరకి వెళ్ళనివ్వలేదు.

అయితే ఇదే విషయాన్నీ రోహిత్ ట్విట్టర్ లో పెడితే విజయ్ దేవరకొండ వెంటనే రోహిత్ కి రిప్లై ఇస్తూ ఈ నెల 15 న కలుద్దాం ఫ్రీ ఉన్నావా లేదా రోహిత్ అని అడిగాడు. ఇలా ఒక స్టార్ నుంచి రిప్లై రాగానే రోహిత్ షాక్ అయ్యాడు. అలాగే తన టీం రోహిత్ కి టచ్ లోకి వస్తారు అని వాళ్ళే తనని గైడ్ చేసి నా దగ్గరకి తీసుకొని వస్తారు అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.