ఖ‌చ్చితంగా ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటా..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay
Updated:  2018-08-31 05:22:44

ఖ‌చ్చితంగా ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటా..

అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేవ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమా స‌క్సెస్ అయిన సంద‌ర్భంలో ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఇంట‌ర్వ్యూలో మాటా మాటా మాట్లాడుతూ, విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి విష‌యం ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.
 
ప్రేమ పెళ్లి చేసుకుంటారా లేక పెద్దలు నిర్ణ‌యించిన పెళ్లి చేసుకుంటారా అని మీడియా ప్ర‌శ్నించ‌గా అందుకు విజ‌య్ బ‌దులిస్తూ, తాను ఖ‌చ్చితంగా ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఇప్పుడున్న పరిస్థితిలో పెద్ద‌లు నిర్ణ‌యించిన పెళ్లి చేసుకోవ‌డం త‌న వ‌ల్ల అయితే కాద‌ని అన్నారు. తాను ఒక‌ప్పుడు 40 సంవ‌త్స‌రాల‌కి పెళ్లి చేసుకోవాల‌నుకున్నాని కానీ అది కాస్త 35 సంవ‌త్స‌రాల‌కు వ‌చ్చిందని విజ‌య్ దేవ‌ర‌కొండ తెలిపారు.
 
అయితే ఆంధ్రా అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి.... తెలంగాణ‌ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచ‌న లేద‌ని అన్నారు. ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఎక్క‌డో ఒక చోట అమ్మాయి ఉంటుంది క‌దా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ స్ప‌ష్టం చేశాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు అలాంటి అమ్మాయి క‌న‌ప‌డ‌లేద‌ని అన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.