ముందు అదా? లేదా ఇదా? ఎటు తేల్చుకోలేకపోతున్న విజయ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

devarakonda vijay hero
Updated:  2018-08-30 05:17:09

ముందు అదా? లేదా ఇదా? ఎటు తేల్చుకోలేకపోతున్న విజయ్

రీసెంట్ గా "గీతగోవిందం" హిట్ తో ఏ సినిమా రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడతాడు అనేది ఇండస్ట్రీలో టాక్. అయితే ఎప్పటినుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్న "టాక్సివాలా" మీద కూడా ఈ ప్రభావం చాలా గట్టిగా ఉండబోతోందని సినీవర్గాల వారి మాట. అయితే ఎందుకు వెనక్కి వెనక్కి ఈ చిత్రాన్ని నెడుతున్నారో ఈ పాటికే అందరికి అర్ధం అయ్యుంటుంది.

కాబట్టి ఈ సినిమాని ఇదే ఊపు లో వదిలితే కనీసం పెట్టిన డబ్బులన్నా వస్తాయన్న ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. కాగా, విజయ్ ది ఇంకో చిత్రం కూడా పట్టాలెక్కిసి విడుదలకు సిద్ధం అవుతుంది. అదే “నోటా” అంటూ మొన్నామధ్య పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అసలు చిక్కల్లా ఎక్కడంటే, ముందు "నోటా" విడుదల చెయ్యాలా లేదా "టాక్సివాలా" రిలీజ్ చెయ్యాలా అనే సంగదిగ్ధంలో పడ్డాడు మన రౌడీ. ముందు "నోటా" రిలీజ్ చేస్తే దాని ఫలితం మీద "టాక్సివాలా" ఆధారపడి ఉంటుంది.

"నోటా" హిట్ అయితే "టాక్సివాలా" కి తిరుగుండదు కానీ అది కొంచెం తిరగబడినా "టాక్సివాలా" వచ్చిన దారినే వెనక్కిపోద్ది. సో ముందే "టాక్సివాలను" రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇంకా ఆ చిత్రం తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కానీ "నోటా" మాత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడేం చెయ్యాలా అని సతమతం అవుతున్నాడు విజయ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.