విజయ్ దేవరకొండ తో పెట్టుకొని బుక్ అయిన నాగ శౌర్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda and naga sourya
Updated:  2018-08-30 11:28:19

విజయ్ దేవరకొండ తో పెట్టుకొని బుక్ అయిన నాగ శౌర్య

మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూ లో నాగశౌర్య మాట్లాడుతూ ఫ్యాన్స్ ఉండే చివరి హీరో ఒక్క 'రామ్ చరణ్' మాత్రమే అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఇదివరకటి రోజులు ఇప్పుడు లేవని, యంగ్ హీరోలు అందరు అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళని చూసినప్పుడు ఎక్సైట్మెంట్ కి గురయ్యే సందర్భాలు తక్కువేనంటూ చెప్పుకొచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే.
 
గుమ్మడికాయల దొంగ ఎవ్వర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు, నాగాశౌర్య మాటలను విజయ్ దేవరకొండ ఫాన్స్ కొంచెం సీరియస్ గా తిసుకున్నట్టున్నారు. "గీతాగోవిందం" తో మంచి హిట్ కొట్టి ఊపుమీదున్న విజయ్ కి ఫ్యాన్స్ కొంచెం ఎక్కువనే చెప్పాలి. శౌర్య మాటలను తప్పుగా ఆపాదించుకుని ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు మన రౌడీలు.దాంతో శౌర్య రంగంలోకి దిగి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేసాడు.
 
ఒక్క సినిమా హిట్ అయితే సూపర్ స్టార్ కాదని, ప్లాప్ వచ్చినా కుడా అదే స్థాయిలో కలెక్షన్ వచ్చినప్పుడే సూపర్ స్టార్లు అవుతారని, అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే సాధించాడని వివరణ ఇచ్చాడు మన హీరో.సో అదండి సంగతి. సగం సగం వినేసి లేని పోనీ అర్ధాలు తీసుకుని అందరిని బాధపెట్టడం ఈ మధ్య ఎక్కువ అయ్యిందని సినీప్రముఖులు భావిస్తున్నారు.

 

షేర్ :