నేను మా అమ్మా నాన్న‌ల మాటే విన‌ను..మీ మాట ఎందుకు వింటాను

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda hero
Updated:  2018-08-16 12:07:39

నేను మా అమ్మా నాన్న‌ల మాటే విన‌ను..మీ మాట ఎందుకు వింటాను

సెన్సేషనల్ హీరో అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా అయిన “గీత గోవిందం” ఈరోజు రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పాట కూడా పాడి సింగర్ గా మారాడు. కానీ ఈ పాటలో విజయ్ దేవరకొండ గొంతు అస్సలు బాలేదు అని చెప్పి బయట భిన్న అభిప్రాయలు ఎదురయ్యాయి.

అలాగే కొంత మంది ఇక ఫ్యూచర్ లో విజయ్ దేవరకొండ పాటలకి దూరంగా ఉంటే బాగుంటుంది అని అన్నారు. ఈ మాటల విజయ్ చెవిన పడ్డట్టు ఉన్నాయి, అందుకే వారి పై సీరియస్ అవుతూ “నాకు సలహాలు ఇవ్వకండి అస్సలు నచ్చదు, నేను మా అమ్మ నాన్న మాటే వినను, ఇంకా మీ మాట ఎందుకు వింటాను.

నా గొంతు బాలేదు అంటే సరే గాని అస్సలు పాడకూడదు అని చెప్పడానికి మీరెవరు” అంటూ తెగ సీరియస్ అయిపోయాడు ఈ “అర్జున్ రెడ్డి” స్టార్.

షేర్ :